Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన జీవితం తరతరాలకు ఆదర్శం
నవతెలంగాణ-కొత్తగూడెం
పుచ్చలపల్లి సుందరయ్యలా మనమంతా మెలగాలని, ఆయన జీవితం తరతరాలకు ఆదర్శమని, ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. బుధవారం సుందరయ్య 36 వర్థంతి సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంచి కంటి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ సుందరయ్య జీవితం తరతరాలకు ఆదర్శం అన్నారు. భారత దేశంలో కమ్యునిస్ట్ సిద్ధాంత అవగాహన చేసుకొని ప్రజా సంక్షేమం కోసం కమ్యునిస్ట్ పార్టీ అవసరం అని పునాదులు వేసిన మహనీయుడు ఆయన అన్నారు. అనేక ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని స్థిరమైన పార్టీ, కార్యకర్తలు అవసరం అని ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి, ప్రజల కోసమే పార్టీ అనే వారందరూ కమ్యునిస్ట్ పార్టీలోకి రావాలని యువతకు పిలుపునిచ్చిన మహనీ యుడన్నారు. పని స్వభావం రీత్యా వారికి సంఘాలు ఏర్పాటు చేసుకొని పోరాటాలు నిర్వహించాలనీ ప్రజలకు అండగా నిలిచిన నేత అని తెలిపారు. ఆయన పేరు వినగానే నిజాయితీకి మారుపేరుగా, పార్టీ కోసం పిల్లలు పుట్టకుండా నిరంతరం ప్రజల గొంతుకల తన జీవితాన్ని త్యాగం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి, సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన ఘనుడన్నారు. శాసన సభ పక్ష నేతగా పార్లమెంట్లో ప్రతి సమస్యపై సమగ్ర అవగాహన పెంచుకొని మార్క్సిస్ట్ పార్టీ తరఫున విశ్లేషణ చేసి, ప్రభుత్వానికే సలహాలు, సూచనలు చేసిన ఘనత సుందరయ్యకే దక్కిందన్నారు. ప్రజా సేవల విషయంలో, తక్కువ ధరలకు సరుకులని ప్రజలకు ఇచ్చి ప్రజలకు ప్రజా సేవను నేర్పించిన చరిత్ర సుందరయ్యదే అన్నారు. నేటి వర్తమాన కాలంలో ప్రజలకు అండగా కమ్యునిస్ట్ సిద్ధాంత అవగాహనతో కార్యకర్తలు అందరు సుందరయ్య లా మనమంతా మెలగాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, జిల్లా కమిటీ సభ్యులు లిక్క బాలరాజు, నాయకులు జునుమాల నగేష్, నందిపాటి రమేశ్, కెహచ్.ప్రసాద్, వై.వెంకటేశ్వర్లు, వీరభద్రమ్, శంకర్ రావు, ప్రశాంత్, తదితరుల పాల్గొన్నారు.
అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలం బావోజీ తండలో పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య 36వ వర్ధంతి సభ నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జాటోత్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సభకు మండల నాయకులు వాంకుడోత్ కోబల్ అధ్యక్షత వహించగా సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రైతాంగ సాయుధ పోరాటం చేసి మూడు వేల గ్రామాల విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వాంకుడోత్ అమర్ సింగ్, నుణవత్ సూర్య, ధరావత్ వెంకన్న, సురేష్, బట్టు వెంకటేశ్వర్లు, సీతారాం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ముందుగా మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు జండా ఆవిష్కరణ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సుందరయ్య చిత్రపటానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, పార్టీ సీనియర్ నాయకులు వంకాయలపాటి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీధర్ మాట్లాడారు. నేటి తరం నాయకులు సుందరయ్య ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వై.నరేష్, రాయి రాజా, మిర్యాల మోహన్ రావు, రామడుగు వెంకటాచారి, వీరయ్య, నాగేశ్వరరావు, భూపాల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి పురస్కరించుకొని మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ఎం.శివ, డి. పవన్, నాగేష్, రామ్ చరణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : ఉద్యమ నిర్మాతల అడుగు జాడల్లో సీపీఐ(ఎం) బలోపేతానికి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి రవికుమార్ పిలుపు నిచ్చారు. లకీëగనరం స్టేట్ బ్యాంకు ఎదరుగా ఉన్న యలమంచి సీతారామయ్య, గుడ్ల శివరావుల స్థూపం వద్ద అమరజీవులు పుచ్చలపల్లి సీతారామయ్య 36 వర్ధంతి, యలమంచి సీతారామయ్యల 14వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన వర్ధంతి వేడుకల్లో ముందుగా పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు సుందరయ్య, సీతారామయ్య, గుడ్ల శివరావుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రవికుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కొర్సా చిలకమ్మ, లకీëనగరం సర్పంచ్ సరియం రాజమ్మ, ఉపసర్పంచ్ గుడ్ల రామ్మోహన్ రెడ్డి, వ్యకాస మండల అద్యక్షులు ఉబ్బా సంపత్, రైతు సంఘం మండల అధ్యక్షుడు యలమంచి శ్రీను బాబు, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు తెల్లం ధర్మయ్య, కృష్ణ, ఎండి బేగ్, గుడ్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : దొడ్డా కృష్ణయ భవన్లో సుందరయ్య 36వ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని సత్తెనపల్లి నరేష్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చల్లా రంగా మాట్లాడారు. వెంకటయ్య, అయినాల రామ లింగేశ్వర రావు, షేక్ మస్తాన్, ముచ్చింతల చెన్నయ్య, మోహన్, చల్ల నాగేశ్వరి రావు తదితరులు పాల్గొన్నారు.
సారపాక : పుచ్చలపల్లి సుందరయ్య 36వ జయంతి వేడుకలను సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం సారపాక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం పాపినేని సరోజినీ అధ్యక్షతన నిర్వహించగా మండల కమిటీ సభ్యులు రామనాథం, బయ్యా రాము, వెంకటేశ్వర్లు, సభ్యులు అబీద, గోపాలరావు, యర్లంకి అప్పారావు, చంద్రరావు, టి.కుమార్, శివ తదితరుల పాల్గొన్నారు.
దమ్మపేట : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్థంతిని పార్టీ మండల కార్యాలయంలో పిల్లి నాయుడు అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ పుచ్చలపల్లి చిత్రపటానికి పార్టీ మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డాలక్ష్మినారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కన్వీనర్ కొప్పుల శ్రీనివాసరావు, శాఖా కార్యదర్శి భోగిం నరసింహారావు, ముష్టిబండ శాఖా కార్యదర్శి శ్రీనివాసరావు, ధర్మయ్య, నాగేంద్రరావు, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : దక్షణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం కరోనా నిబంధనలకు లోబడి ఆయనకు ఘనమైన నివాళి అర్పించారు. కొత్త బస్టాండ్, ఏలూరి భవన్లలో సీపీఐ(ఎం) అధ్వర్యంలో సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ కార్యక్రమాలలో నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, ఈసం వెంకటమ్మ, వాసం రాము, రాందాస్, సలీం, కూకట్ల శంకర్లు పాల్గొన్నారు.
టేకులపల్లి : పేదరికం, దోపిడి లేని సమాజం కోసం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చూపిన మార్గంలో నడుద్దామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో (36)వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, వీరన్న, కోటేశ్వరి, స్టాలిన్, మమత, జై విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : సుందరయ్య స్ఫూర్తితో నేటి యువతరం ముందుకు సాగాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కాటిబోయిన నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం 36వ వర్ధంతి సభను శ్రామిక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, ఎస్.వెంకట్రావులు పూలమాలవేసి నివాళుర్పించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కోడిశాల రాములు, రాజు, వై.రంగయ్య, నాగేశ్వరరావు, నర్సింహారావు, నందం ఈశ్వర్రావు, గుర్రం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.