Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డగోలుగా పెరుగుతున్న కేసులు
- జెన్కోట్రాన్స్డిస్కంలలో 150 మంది మృతి
- నియంత్రణ చర్యలు చేపట్టని యాజమాన్యాలు
+ కార్మిక సంఘాల విజ్ఞప్తిని పట్టించుకోని ప్రభుత్వం
- ఇంకా ప్రారంభం కాని వ్యాక్సినేషన్ ప్రక్రియ
- ఆందోళనలో ఉద్యోగ కార్మిక కుటుంబాలు
నవతెలంగాణ-పాల్వంచ
రాత్రి, పగలు విధులు నిర్వహిస్తూ నిత్యం ప్రజానీకానికి వెలుగులు పంచి ప్రాణాలు కాపాడుతున్న విద్యుత్ ఉద్యోగులు వారి జీవితాల్లో మాత్రం కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. ప్రతీ పనికి విద్యుత్ సరఫరా లేనిదే ముందుకు నడవదు. అలాంటి ఈ సంస్థల్లో కోవిడ్ మహమ్మారి వారి ప్రాణాలను బలితీసుకుంటుంది. విద్యుత్‌రంగ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం తొలుత విద్యుత్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి పిట్టల్లా రాలిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోజు పదుల సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండడంతో సహ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కళ్లముందే కలిసి ఉద్యోగం చేస్తూ కోవిడ్ సోకి మృత్యువాత పడడంతో తట్టుకోలేకపోతున్నారు.
రాష్ట్రంలో ఉన్న జెన్కో డిస్కం ట్రాన్స్ఫార్మర్లలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులు కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్నారు. మొదటిదశలో తక్కువ సంఖ్యలో మరణాల సంఖ్య ఉన్నప్పటికీ రెండవ ఉధృతిలో మాత్రం ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులు 2800 వరకు కోవిడ్ బారిన పడ్డారు. అందులో 150 పైచిలుకు మృతి చెందినట్టు తెలుస్తుంది. 12వందల మందికి పైగా కోలుకుని విధులు నిర్వహిస్తున్నారు. అందులో 14 వందలకుపైగా ఇండ్లల్లో, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. కానీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో మరింత ప్రాణనష్టం జరుగుతుంది. కొన్ని చోట్ల ప్రత్యేకంగా జెన్కోకు ఉన్న ఆసుపత్రులలో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేయకపోవడం చికిత్స ప్రక్రియ చేపట్టలేదు. దీంతో కోవిడ్ బారిన పడిన కార్మికలుందరూ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి మృత్యుతవాత పడ్డ సంఘటనలున్నాయి.
విద్యుత్ రంగంలో కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలి ః కార్మిక సంఘాలు
విద్యుత్ రంగంలో రెండవ దశ కోవిడ్ ఉధృతితో అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్న విషయం దృష్టిలో ఉంచుకుని కార్మిక సంఘాలు మరోసారి యాజమాన్యాలకు తమ డిమాండ్లను వినతిపత్రం ద్వారా తెలియజేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఫ్రంట్‌లైన్ వారియర్‌గా గుర్తించి కోవిడ్ టీకాలు ప్రాముఖ్యత ఇవ్వాలంటున్నారు. ప్రతీ ఆసుపత్రిలో ప్రత్యేక టీకా బెడ్లను కేటాయించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని, కోవిడ్ సోకిన ఆర్టిజన్లకు వేతనంతో కూడిన సెలవులు మొదటి దఫా మార్చినుండి అమలు చేయాలని మీటర్ రీడింగ్, రెవెన్యూ వసూల్ల కోసం విద్యుత్ ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా చేయాలంటున్నారు. కోవిడ్‌తో చనిపోయిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్సీస్ మొత్తం కలుపుకున్న గ్రాడ్యూటీ చెల్లించాలని, ఉద్యోగులకు ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని నియమించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న 33 శాతం హాజరు పద్ధతిని అమలు చేయాలని, ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న కోవిడ్ ఎక్స్‌గ్రేషియా రూ.50 లక్షలు విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జెన్కో యాజమాన్యాలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.