Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి
నవతెలంగాణ- సత్తుపల్లి
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పుచ్చలపల్లి సుందరయ్య ఆవిరళ కృషి చేశారని, భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య పెత్తందారీ వ్యవస్థ నిర్మూలన కోసం ఉద్యమించారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు అన్నారు. బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సుందరయ్య 36 వర్థంతిని జరిపారు. సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సుందరయ్యకే చెల్లుతుందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, ఎస్కే సైదా, ఒండూరి రవి, చావా రమేశ్, శ్రీనివాసరావు, ఎస్కే బాజీ, పాల్గొన్నారు.
చండ్రుపట్లలో సుందరయ్య వర్ధంతి
కల్లూరు : మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో బుధవారం రాత్రి పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, పీఎస్ చిత్రం పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపియం మండల కమిటీ సభ్యులు బట్టు నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.