Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో కరోనా నివారణకు యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా ఆ గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు చర్యలు చేపట్టారు. గ్రామంలో కరోనా కట్టడి లో భాగంగా సర్పంచ్ తిరుపతి రావు ప్రతినిత్యం గ్రామ ఆరోగ్య పరిస్థితులపై అధికారుల సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రతి వార్డు నందు పారిశుధ్య పనులు నిర్వహిస్తూ, కరోనా కట్టడి కోసం సోడియమ్ హైపో క్లోరైడ్ పిచికారీ చేయిస్తు, బ్లీచింగ్ చల్లిస్తూ, గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే లో స్వయంగా తాను ప్రతి ఇంటికి వెళుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికీ తగు సూచనలు చేస్తూ వారికీ అవసరమైన మెడికల్ కిట్ అందజేయడంలో, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించడం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా సోకినా వారిని బహిరంగ ప్రదేశాలలో తిరగకుండా ఓం క్వారంటైన్ లో ఉండే విధంగా, ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ ప్రతి రోజు ఉదయం సాయంత్రం వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, క్షేమమే లక్ష్యంగా సర్పంచ్ చేస్తున్న సేవలను గ్రామా ప్రజలు అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ కరోనాను ప్రజల సహకారంతో మాత్రమే కట్టడి చేయటం సాధ్యపడుతుందన్నారు. ప్రజల పౌష్టిక ఆహారం తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తే కరోనాని జయించవచ్చు అన్నారు. భయాందోళనలు లేకుండా కరోనా బాధి తుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రతినిత్యం కరోనా కట్టడి కోసం పాటు పడుతున్న పంచాయతీ కార్యదర్శి పరశురాం, ఆశా కార్యకర్తలు కళావతి, కుమారి అంగన్ వాడీ కార్యకర్తలు పద్మ, హుస్సేన్ బీ గౌరమ్మ, పంచాయతీ గుమాస్తా బలగాని నాగరాజు, పారిశుధ్య కార్మికులు పిచ్చయ్య, తిరుపతి కరోనా బాధితులకు భరోసానిస్తూ కరోనా ను కట్టడి చేయడం కోసం కృషి చేస్తున్నారన్నారు.