Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ నాయకుడు ముళ్ళపాటి చిట్టి బాబు కుటుంబానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కార్యాలయ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ బుధవారం పది వేల రూపాయల నగదును అందజేశారు. ముళ్ల పాటి చిట్టిబాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ కనక మేడల సత్యనారాయణ ను చిన్న బీరవల్లి గ్రామం పంపించారు. చిట్టి బాబు కుమారుడితో ఫోన్లో మాట్లాడి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చండ్ర కిరణ్, కోయినేని ప్రదీప్, బంధం నాగేశ్వరరావు, సర్పంచ్ పేరబత్తిన శాంతయ్య, చండ్ర వెంకట్రావు, చెరుకు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిట్టి బాబు కుటుంబ సభ్యులు నామా నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు.