Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ నామ సేవలు అభినందనీయం
ఐపీఎస్ అధికారిణి స్నేహ మెహ్ర
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ఔదార్యాన్ని పోలీసులు ప్రశంసిస్తున్నారు. ఎంపీ నామ ఆదేశాల మేరకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా ఎర్రటి ఎండలో సైతం రోడ్ల మీదకు వచ్చి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు బుధవారం పెద్ద ఎత్తున ఫేస్ మాస్క్ షీట్స్, మంచినీళ్ల బాటిళ్లు ఉచితంగా అందజేయడం ప్రశంసలందుకున్నది. ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధ్వంసలాపురం కొత్త వంతెన, ఎన్టీఆర్ సర్కిల్, బల్లేపల్లి, శ్రీనివాసనగర్, కాల్వొడ్డు, ముస్తాఫానగర్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఫేస్ మాస్క్ షీట్స్, వాటర్ బాటిళ్లను అందజేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఐపీఎస్ అధికారిణి స్నేహ మెహ్రకు ఫేస్ మాస్క్ షీట్స్, వాటర్ బాటిల్స్ అందజేయగా ఆమె ఎంపీ నామ నాగేశ్వరరావును, నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ బాధ్యులను అభినందించారు. ఎంపీ నామ నాగేశ్వరరావు మానవతా సేవా దృక్పధంతో ముందుకు వచ్చి, నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున పోలీసులకు ఫేస్ మాస్క్ షీట్స్, వాటర్ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు వ్యక్తిగత సహాయకులు నాగరాజు, నామ సేవా సమితి బాధ్యులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్‌బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, సరిపూడి గోపి సందేశ్ తదితరులు పాల్గొన్నారు.