Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎం.వి రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంలో విముఖత చూపని వైద్యులు భవిష్యత్తులో ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయుటకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎంవి. రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుండి కోవిడ్ చికిత్సలు నిర్వహణ, బెడ్లు, ఆక్సిజన్ వినియోగం, నిల్వలు, సరఫరా, ఇంటింటి సర్వే నిర్వహణ, కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు, అటవీ, పోలీస్, వైద్య, జడ్పీ, డీఆర్డిఓ, డీసీఓ, రవాణా, విద్యుత్, అగ్నిమాపక, ఎక్సైజ్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, కోవిడ్ కేంద్రాల నోడల్ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఐసీయంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ప్లాస్మా థెరపిని నిర్వహించడానికి అవకాశం లేనందున ప్లాస్మా థెరపి చేయొద్దని స్పష్టం చేశారు. కోవిడ్ వైద్య సేవలు నిర్వహణకు అనుమతిచ్చిన 21 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11 ఆసుపత్రులు మాత్రమే రెమిడెసివిర్ ఇంజన్లు వినియోగం కోసం కోడ్ జనరేట్ చేశామని తెలిపారు. మిగిలిన 10 ఆసుపత్రుల్లో తక్షణమే కోడ్ జనరేట్ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఔషదం. నియంత్రణ అధికారిని, ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణ అధికారిని ఆదేశించారు. మణుగూరు వైద్యశా లలో విధులు నిర్వహించని వైద్యునిపై చర్యలు నిర్వహణకు సిఫారసు చేయాలని, ప్రజ లు కష్టాల్లో ఉన్నపుడు వైద్య చికిత్సలు నిర్వహించకపోతే అతనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
ఇంటింటి సర్వే నిర్వహణలో వ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించిన వ్యక్తులకు హెరీం కిట్లు పంపిణీ చేశామని, హెరీం క్వారంటైన్లో ఉంటూ చికిత్సలు పొందుతున్న వ్యక్తులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు కోసం ఆసుపత్రులకు ఎందుకు వస్తున్నారని పటిష్ట పర్యవేక్షణ చేసి నియంత్రణ చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో బుధవారం వరకు గుర్తించిన లక్షణాలున్న వ్యక్తులు 9 వేల మందికి హెరీమ్ కిట్లు పంపిణీ చేసి పర్యవేక్షణ చేస్తునట్లు చెప్పారు. పాజిటివిటి రేటు అధికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమగ్ర నివేదికలతో గురువారం నిర్వహించనున్న టెలి కాన్ఫరెన్సుకు హాజరు కావాలన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినందున వ్యాధి నియంత్రణకు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు నేపధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి, బజారుకు వస్తున్నారని, వారిలో కోవిడ్ సోకిన వ్య క్తులు కూడా ఉంటున్నారని క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు అమలు చేయాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు కర్నాటి వెంకటేశ్వర్లు, డి.అనుదీప్, అటవీశాఖ అధికారి రంజిత్, వైద్యాధికారులు శిరీష, ముక్కంటేశ్వరావు, ఔషద నియంత్రణ అధికారి ఆలే బాలక్రిష్ణ, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డిఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, ఎక్సైజ్ ఈఎస్ నరసింహారెడ్డి, రవాణ అధికారి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.