Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాల మృత్యుహారణం..సర్వ వ్యాధి నివా రణం..సమస్త పాపక్షయకరం..సీతా రామ లక్ష్మణ స్వాములవారి పోదోదకం..పావనం శుభం అని తీర్దం ఇచ్చే పర్ణశాల కోవెల లాక్ డౌన్ వేళ కళ తప్పింది. నిత్యం ద్వేద్వీప్య మానంగా హారతులు, అభిషేకాలు అందుకోవాల్సిన పూజలు నిలిచి పోయాయి. పురోహి తుల మంత్రోచ్చరణాలు, ఆలయం గంటలు మూగబో యాయి...కోవిడ్ 19 లాక్ డౌన్ పుణ్యమా అని ఆలయ తలుపులు మూసి వేయడంతో ప్రతి రోజు మంగళహారతులు అందుకోవాల్సిన రామయ్య మోము చిన్న బోయింది అని చెప్పవచ్చు.
- నిర్మానుషంగా దేవాలయ పరిసర ప్రాంతాలు
- చిరు వ్యాపారులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంద ఆలయం..దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పర్ణశాల రామాలయం లాక్ డౌన్ వేళ కళ తప్పింది. మొదటి విడత కోవిడ్-19 సమయంలో నాలుగు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గదర్శకాలతో లాక్ డౌన్ విదించడంతో ఆ సమయంలో కొన్ని రోజుల పాటు రామాలయ తలుపులను ఆలయ అధికారులు మూసి భక్తలకు దర్శనాలు నిలిపి వేశారు. కోవిడ్-19 రెండవ దశ ఈ నెల 12వ తేదీ నుండి లాక్ డౌన్ విదించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో భాగంగా ఆలయ దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు అధికారులు పేర్కొని ఆలయ తలుపులు మూసి వేశారు. కాగా గత ఏడాదితో పాటు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లోక కల్యాణార్దం నిర్వహించాల్సిన సీతారాముల కల్యాణాన్ని సైతం ఆలయ అధికారులు కొద్ది మంది భక్తుల నడుమ నిర్వహించారు. గత ఏడాది కల్యాణాన్ని గర్భాలయంలో నే నిర్వహించడం జరిగింది. గత 14 నెలలుగా కరోనా పుణ్యమా అని భక్తులతో కళ కళలాడాల్సిన పర్ణశాల రామాలయం భక్తులు, పర్యాటకులు లేక వెళ వెళ పోతుంది అనే చెప్పవచ్చు..
నిర్మానుషంగా దేవాలయ పరిసరాలు : కోవిడ్-19 మొదటి దశ, రెండవ దశ పుణ్యమా అని పర్ణశాల రామాలయంతో పాటు ఆలయ సరిసరాలు నిర్మానుషంగా మారాయి.
నిత్యం భక్తులు, పర్యాకుల మద్య కళ కళ లాడాల్సిన దేవాలయంతో పాటు, సీతా కుటీర ప్రదేశం, నారచీరల ప్రాంతాలు, గోదావరి పరిసర ప్రాంతాలు వెల వెల బోతున్నాయి. పర్ణశాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీల మాటలు గోదావరి నది పై నీటి రాతలుగానే మిగిలాయి అని విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. ఇప్పిటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రసిద్ధి గాంచిన పర్ణశాల దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటకంగా, అద్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
చిరు వ్యాపారులకు కోలుకోలేని దెబ్బ : పర్ణశాల ఆలయ ప్రాంగణంలో సుమారు 70 నుండి 80 మంది వరకు జీవనాధారంగా చిరు వ్యాపారాలు సాగిస్తుంటారు. వీరు వివిద రకాలు ప్లాస్టిక్ బొమ్మలు, దేవుళ్ల ఫోటో ప్రేమ్లు, వివిద రకాలు ఆట వస్తువులు, ఇప్ప పువ్వు, పసుపు, కుంకుమలు వంటివి అమ్ముతుంటారు. రెక్కాడితే డొక్కాడని వీరు గత ఏడాది శ్రీరామనవమి సమయంలో లక్షల రూపాయలు అప్పులు చేసి వస్తువులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో మొదటి విడత కరోనా లాక్ డౌన్ ప్రకటించడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్ట లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.