Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి
- జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే సందర్భంగా నిరసనలు
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజాసంఘాల పిలుపు మేరకు పాల్వంచలో సిపిఎం పార్టీ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి అప్పారావు మాట్లాడుతూ.. కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు రూ.50లక్షల ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దొడ్డా రవికుమార్, సీఐటియు పాల్వంచ పట్టణ కన్వీనర్ గూడెపురీ రాజు, ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వి సత్యవాణి, కే.సత్య, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బ్లాక్డే పాటిస్తూ నిరసన
బూర్గంపాడు : మండల తహసీల్దార్ కార్యాయం ఎదుట సారపాక పంచాయతీ కార్యాలయం, టేకుల చెరువు గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్డే పాటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు ముద్ద బిక్షం, పాండవుల రామనాథం, కొమర్రాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ(ఎం) ఆద్వర్యంలో బ్లాక్ డే
అశ్వారావుపేట: కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య అన్నారు. ఈ చట్టాలకు నిరసిస్తూ బుధవారం బ్లాక్ డే ని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం అయిన సుందరయ్య భవన్ లో నల్ల బ్యాడ్జిలు ధరించి,డిమాండ్లతో కూడిన ప్లే కార్డు లు తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.