Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
పేదింటి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి గొప్ప వరమని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీలోని 11వ వార్డుకు చెందిన కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు సుమారు రూ.51 లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు, కో -ఆప్షన్ సభ్యులు ఎండి. యాకూబ్, దుంపల అనురాధ తదితరులు పాల్గొన్నారు.