Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి ఫుడ్ బ్యాంకు నిర్వాహకురాలు పఠాన్ ఆశాఖాన్ కు బియ్యం, నిత్యావసర సరుకులను ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ చేతుల మీదుగా బుధవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందించారు. హౌం ఐసోలేషన్, కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఆశాఖాన్ రెండు పూటలా భోజనం, మంచినీరు క్రమం తప్పకుండా అందిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర సీపీకి వివరించారు. ఆశాఖాన్ సేవలను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ సుజాత, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికష్ణారెడ్డి, ఏసీపీ వెంకటేశ్ పాల్గొన్నారు.