Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లాలోని బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటుగా మూడు షిఫ్ట్ డ్యూటీలతో 24గంటలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గ ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్యతో కలిసి పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలోకి వచ్చే మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర రవాణా సర్వీసులకు మాత్రమే అనుమతి ఉందని, రాష్ట్ర సరిహద్దు దాటి గ్రామాల మీదుగా జిల్లాలోకి రాకుండా గ్రామ వాలంటరీల కాపలా ఉన్నారని పాస్ లేకుంటే ఎవరికి అనుమతి లేదన్నారు. పెనుబల్లి మండలం, ముత్తగూడెం గ్రామం నందు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు పరిశీలించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల్లో కఠినమైన ఆంక్షల అమలవుతున్నయని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రజలందరూ సహకారి స్తున్నారని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు నుండి అంతర్గత దారుల వెంటా రాకుండా పోలీసు ,రెవెన్యూ, అధికా రులు గ్రామలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తు న్నారు. గ్రామా వాలంటరీ పటిష్ట పరిచి పోలీస్ మార్గదర్శకాలు పాటిస్తూ సరిహద్దు గ్రామలలో కాపలా కాస్తున్నారు. ఈ సందర్భంగా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, ఆశ వర్కర్లకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్, వాటర్ బాటిల్స్‌ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్, సిఐ కరుణాకర్ పాల్గొన్నారు.