Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సిపిఎం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఆపన్నహస్తం అందించారు. రావినూతల గ్రామంలో కరోనా బారిన పడి హౌమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధితులకు మనోధైర్యాన్ని నింపుతూ కొమ్మినేని. పిచ్చయ్య అందించిన సహకారంతో 18 మందికి రాగి జావ, కోడిగుడ్లు, నిమ్మకాయలు, కూరగాయలు, పండ్లు, శానిటేజర్, మాస్క్ బుధవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రావినూతల గ్రామంలోని కరోనా బాధితులకు అందించారు. వీరితో పాటు నిరుపేదలైన 4 కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తు బాసటగా నిలిచారు. ఈ చేయూత కార్యక్రమంలో రావినూతల ఎంపీటీసీ కందిమళ్ళ రాధ, వైస్ సర్పంచ్ బోయినపల్లి కొండ, రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా నాయకులు గుగులోతు పంతులు, ఆర్ఎంపిల సంఘం మండల నాయకులు కొంగర గోపి, యూత్ ఇంచార్జ్ ఎర్రగాని నాగరాజు, టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, గొర్రెల కాపరులసంఘ నాయకులు మంద వీరభద్రం, జోనిబోయిన గురవయ్య, సిఐటియూ నాయకులు గుగులోతు నరేష్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు భాణోతు గోపి, వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, మంద కోటేశ్వరి, మాజీ వార్డు మెంబర్ బూసిపోగు వెంకటి, గీత కార్మిక సంఘం నాయకులు మరీదు పుల్లయ్య, డివైఎఫ్ఐ నాయకులు రేగళ్ళ గోపి, పుచ్చకాయల శివాజీ, లావూరి రంజిత్, ఆవుల భాను పాల్గొన్నారు.