Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధితులకు కౌన్సిలింగ్
నవతెలంగాణ-కారేపల్లి
కోవిడ్ బారిన పడిన వారిని అధికారులు కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే పనిని ముమ్మరం చేశారు. తహసీల్ధార్ డీ.పుల్లయ్య, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, ఎస్సై పీ.సురేష్‌లు టీమ్‌గా ఏర్పడి బాధితులు అధికంగా గ్రామాల్లోని కోవిడ్ బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు బాధితులను తరలేలా వారిని చైతన్యం చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి, కుటుంబ సభ్యుల బాగుకోసం తప్పనిసరిగా ఐసోలేషన్‌కు రావాలని వారికి నచ్చచెప్పుతుండటంతో కరోనా బాధితులు ఐసోలేషన్కేంద్రాలకు తరలి వెళ్లుతున్నారు. బుధవారం సీతారాంపురం, భాగ్యనగర్‌తండా, మాదారం గ్రామా ల్లో ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు, బాధితులను ఐసోలేష న్లో వైద్యులు పర్యవేక్షణలో ఉండేలా చేస్తున్నారు.
బాధితులకు పండ్లు పంపిణి చేసిన ఎస్సై
కారేపల్లిలోని మోడల్ స్కూల్ ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కోవిడ్ బాధితులకు కారేపల్లి ఎస్తై పీ.సురేష్ పండ్లను పంపిణిచేశారు. పండ్లను కారేపల్లి సర్పంచ్ ఆదెర్ల స్రవంతి చేతుల మీదిగా బాధితులకు అందజేశారు. ఈసందర్బంగా ఎస్సై సేవలను సర్పంచ్ కొనియాడారు. ఈకార్యక్రమంలో వీఆర్ఏ బీ.బాలరాజు, టీఆర్ఎస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, ఆదెర్ల ఉపేంధర్ తదితరులుపాల్గొన్నారు.