Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ హైవేస్ డీఈఈ నిర్మల సూరిబాబు
నవతెలంగాణ-సత్తుపల్లి
అభాగ్యుల అవసరాలు గుర్తిస్తూ, వారికి నిరంతర సేవ చేస్తున్న నవచైతన్య స్వఛ్చంద సంస్థ సమాజసేవలో మేటి అని నేషనల్ హైవేస్ డీఈఈ నిర్మల సూరిబాబు అన్నారు. బుధవారం నిర్మల, సూరిబాబు దంపతుల కుమార్తె శ్రీవర్ష జన్మదినం సందర్భంగా కరోనా బాధితులకు చేయూత అందించేందుకు నవచైతన్య సంస్థకు రూ.5000 అందజేసి, వారి ద్వారా పట్టణంలోని పాలవాడ, జవహర్‌నగర్‌లోని 21 కోవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గాదె నరసింహారెడ్డి, తోటకిరణ్లు మాట్లాడుతూ సంస్థ సేవలు పొందేందుకు, ఆర్ధిక చేయూతను అందించేందుకు 8897777223, 9703703708 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు మాదిరాజు పుల్లారావు, మైలమాల యేసయ్య, మోరంపూడి జగదీష్, గుడిపూడి సుధీర్, రాగం శ్రీను, సయ్యద్ ముస్తఫా, పాలకొల్లు కార్తీక్, సునీల్, పాలకొల్లు శ్రీనివాసరావు, కొలికపోగు మారయ్య తదితరులు పాల్గొన్నారు.