Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కరోనా నియంత్రణలో మండల అధికారుల సేవలు భేష్‌గా ఉన్నాయని మాధారం సర్పంచ్ అజ్మీర నరేష్ కొనియా డారు. బుధవారం సర్పంచ్, తహసీల్ధార్ డీ.పుల్లయ్య, ఎస్సై పీ.సురేష్ గోవింద్ తండాలో పర్యటించి కోవిడ్ బాధితులను మాధారం ఐసోలేషన్ కేంద్రానికి తరలించ ారు. ఈసందర్బంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ అధికారులు రాత్రనక, పగలనక గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యం చేయటం, కోవిడ్బాధితులకు మనోధైర్యం చెప్పటం, వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించటం ద్వారా మాదారం గ్రామపంచాయతీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గోవింద్తండాలో కరోనా బాధితులను మాధారంలో నిర్వహిస్తున్న ఐసోలేషన్ కేంద్రానికి తరలించటం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డకట్ట వేసినట్లు తెలిపారు. ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం వలన మెరుగైన వైద్యం, పౌష్టికాహారం బాధితులకు అందుతుందని, ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే వెంటనే ఖమ్మం ప్రభుత్వ అసుపత్రికి తరలించి ప్రాణప్రాయం నుండి కాపాడ టానికి అవకాశం ఉంటుందన్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఫలితాలు రావాలంటే ప్రజలందరు కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఇండ్లలో జరిగే శుభ, ఆశుభ వేడుకలను వాయిదా వేసుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై పంచాయతీరాజ్ చట్టం, అంటువ్యాధుల నియంత్రణ చట్టం క్రింద కేసులు నమోదు చేయించటం జరుగుతుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ ఇంచార్జీ కార్యదర్శి భూక్యా నిరంజన్, వార్డు సభ్యులు లాలు పాల్గొన్నారు.