Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోసగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- నిందితుని నుండి కొంత నగదు స్వాధీనం
- విలేకరుల సమావేశంలో ఏఎస్పి రోహిత్ రాజ్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఇంటి నిర్మాణానికి రూ. 60 లక్షలు లోన్ ఇప్పిస్తామని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చామని నమ్మబలికి అమాయకుల నుండి డబ్బు కాజేసిన మోసగాడిని పోలీసులు అతన్ని అరెస్టు చేశారని, రూ.12.50లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు ఏ.ఎస్.పి రోహిత్ రాజ్ తెలిపారు. బుధవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్లో వాహనాలను తనికీ చేస్తుండగా ఒక వ్యక్తి ఏపీ 39, ఈసీ-7093 ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వస్తుండా ఆపి తనిఖీ చేయగా అతని మోటార్ సైకిల్ డిక్కీ కింద పరిశీలించి చూడగా రూ. 12.50లక్షలు ఉన్నాయి. వీటిలో ఫేక్ రూ.6 లక్షలు పిల్లలు ఆడుకునే డబ్బులు గుర్తించారు. వాటిని చూసి సదరు వ్యక్తిని బట్టి డబ్బులు నీకు ఎక్కడివి అని విచారించగా అతడు తన పేరు అక్కల వీరారెడ్డి, పడమటి పాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా అని చెప్పినట్లు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం చుంచుపల్లి మండలం, రాంనగర్ గ్రామం శంకర్, స్వాతిలను ఇంటి లోను ఇప్పిస్తానని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీకు స్వంత ఇల్లు లేదు. మీకు ఇంటి లోను క్రింద రూ. 60లక్షల వరకు ఇప్పిస్తానని చెప్పి అందులో మీరు కూడా కొంత డబ్బులను అనగా రూ.30 లక్షల వరకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నమ్మించాడు. ఆ ప్రకారం శంకర్, వాళ్ళ కూతురు స్వాతి ఇద్దరు కలిసి రూ. 30 లక్షలు ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 3వ తేదీన శ్రీనివాస్ తనవెంట ఒక బ్యాగులో రూ. 30 లక్షలు పిల్లలు ఆడుకునే డబ్బులు తెచ్చి, వారిని నమ్మించి వారి దగ్గర ఉన్న అసలైన రూ.13.50లు వేరే బ్యాగులో వేసుకొని వెళ్ళిపోయాడు. ఇదే కాకుండా గతంలో కూడా ఇతను కృష్ణ జిల్లా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పావని ప్రసాద్, అనిల్ అనే వ్యక్తులతో కలిసి పొలీసు శాఖా నందు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసు, గుంటూరు జిల్లా చెరుకుపల్లి పోలీసు స్టేషన్లో ఒక దోపిడీ కేసు ఉన్నట్లు వివరించారు. ఈ నగదుతో తన స్వంత అవసరాలకు రూ.1 లక్ష వాడుకున్నాడని మిగిలిన రూ.12.50లు అతని నుండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో డిఎస్పిలు జి .వెంకటేశ్వర బాబు, ఎల్. ఆదినారాయణ, ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.