Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు హైకోర్టు యువ న్యాయవాది లక్కినేని గోపినాధ్ ఆకాల మరణాన్ని చింతిస్తూ కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో న్యాయవాదులు గోపి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం గోపి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వక్తలు ప్రసంగిస్తూ లక్కినేని గోపీనాథ్ తన న్యాయవాద వృత్తిని కొత్తగూడెం బార్ అసోసియేషన్ నుండే ప్రారంభించి అనతికాలంలోనే రాష్ట్ర హైకోర్టులో మంచి న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నాడని అన్నారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు అందరితో చాలా సఖ్యతగా మేలిగేవాడని, తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న సమయంలో ఇలా మృత్యువాత పడటం చాలా విషాదకరం అని అన్నారు. న్యాయవాదులు గోపి తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గోపి కుటుంబానికి బార్ అసోసియేషన్ అండగా ఉంటుందని, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నీరుకోండ వెంకట రాజేష్, సహయ కార్యదర్శి కాసాని రమేష్, కోశాధికారి మహ్మద్ సాదిక్ పాషా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ సంతోష్ సాహు లైబ్రరీ సెక్రటరీ అరికల కరుణకర్, సినియర్ న్యాయవా దులు ఉటూకురి పురుషోత్తం, ముకుందరాజ్, రమేష్ కుమార్ మక్కడ్, బైరిశేట్టి చిరంజీవి, గాజుల రాంముర్తి, మెండు రాజమల్లు, రావిలాల రామారావు, లక్కినేని దుర్గారావు, శ్రీ రాముల రవి,జీయ ఉల్ హసన్, గడిపల్లి మహేష్, భాగం మాధవరావు, ఉషారాణి, అంబటి రమేష్, ఉపేందర్, వడ్లకొండ హరి, దోడ్డ సామంత్, సంకుబపన అనుదీప్, యసా యుగంధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.ఫోటో ఉంది వార్తకు ప్రయారిటీ ఇవ్వమని పోతినేనిగారు చెప్పమన్నారు.
హైకోర్టు యువ న్యాయవాది ' లక్కినేని గోపినాధ్ ' మృతికి సీపీఎం సంతాపం
కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది లక్కినేని సత్యనారాయణ కుమారుడు, న్యాయవాది లక్కినేని గోపీనాథ్ మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్ ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. అనతి కాలంలోనే హైకోర్టు న్యాయవాదిగా ఉన్నతంగా ఎదుగుతున్న తరుణంలో గోపినాధ్ మృత్యు వాత పడటం బాధాకరమని సీపీఎం జిల్లా కమిటీ, పట్టణ కమిటీ సంతాపాన్ని ప్రకటించింది.
గోపీనాధ్ మృతికిి ఐలూ సంతాపం
కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు హైకోర్టు యువ న్యాయవాది లక్కినేని గోపినాధ్ ఆకాల మరణాన్ని చింతిస్తూ ఐలూ సంతాపం తెలిపింది. గోపి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోపీనాథ్ తన న్యాయవాద వృత్తిని కొత్తగూడెం నుండే ప్రారంభించి అనతి కాలంలోనే రాష్ట్ర హైకోర్టులో మంచి న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా గోపినాధ్తో తమకు ఉన్న అనుబం ధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐలూ నాయకులు జలసూత్రం శివరాం ప్రసాద్, రమేష్ కుమార్ మక్కడ్, కటకం పుల్లయ్య, కిలారు పురుషోత్తం, సాదిక్ పాషా, రావిలాల రామారావు, గడిదేసి కాంతయ్య, శ్రీరాముల రవి తదితరులు సంతాపం తెలిపారు.