Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో మృతి చెందిన మృతదేహాలకు ట్రస్టు సభ్యులు అంత్యక్రియలు
నిర్వహించడం గొప్ప విషయం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీఆర్ ట్రస్ట్ కరోనా హెల్ప్ లైన్ సెంటర్ సేవలు అభినందనీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. కరోనా బాధితు లకు నిత్యావసర వస్తువులతో పాటు, పౌష్టిక ఆహార పదారా ్థలు అందించినట్టు తెలిపారు. వైద్యపరమైన సూచనలు, సలహాలతో పాటు ప్రత్యక్షంగా కరోనా రోగులను వివిధ హాస్పిటల్స్లో చేర్పించడం జరుగుతుందని ఆయన పేర్కొ న్నారు. కరోనాతో మృతి చెందిన మృతదేహాలకు ట్రస్టు సభ్యు లు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. సోమవారం ట్రస్ట్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్ లైన్ సెంటర్ను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన సందర్శించారు. ట్రస్ట్ నిర్వాహకులను వారు అభినందించారు.
బీసీఆర్ ట్రస్టుకు రూ.7,616 ఆర్థిక సాయం
పట్టణంలోని ప్రముఖులు బీసీఆర్ ట్రస్ట్ కరోనా సహాయ కేంద్రానికి ఆర్థిక సహాయం అందజేశారు. విజయవాడ జ్యువెలరీ అధినేత బులియన్ మర్చంట్ అధ్యక్షులు ఇజ్జాడ ప్రభాకర్ (చిట్టి) రూ.5000, గ్రీన్ భద్రాద్రి వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ళ భూపతి రావు రూ.1116, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ దుక్కిపాటి ప్రకాష్ రావు రూ.1500లు ట్రస్టు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చేయూతనిస్తూ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ట్రస్టు వారు చేస్తున్న సేవలు ప్రసంసానీయమన్నారు.
సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వరరావు, ఏ.జె.రమేష్, ట్రస్ట్ కన్వీనర్ గడ్డం స్వామి, ట్రస్టు నిర్వాహకులు యం.రేణక, యం.బి.నరరసారెడ్డి, బి.వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, నాగరాజు, యస్.డి.ఫిరోజ్, చలపతిరెడ్డిల సమక్షంలో అందజేశారు.