Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
- పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరణ
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పధంలే నిలిపేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ డి.అనుదీప్ తెలిపారు. సోమవారం పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఎంవి రెడ్డి పదీవీ విరమణతో ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతతో కలెక్టర్‌గా అవకాశం కల్పించిందని, అన్ని వర్గాల సహాయ, సహాకారాలతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. జిల్లాలో ట్రైనీ కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన అనుభవంతో జిల్లాలో జరుగుతున్న, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తామని, కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయుటతో పాటు ప్రజా ప్రతినిధులు, మీడియా, జిల్లా ప్రజలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పని చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తానని ఆయన తెలిపారు. నూతన కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనుదీప్‌ను రిటైర్డ్ కలెక్టర్ డాక్టర్ ఎంవి. రెడ్డి, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ అశోక్ చక్రవర్తి, ఏఓ గన్యా, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.