Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పూర్వ కలెక్టర్ ఎంవి.రెడ్డి
- ఘనంగా ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మానోత్సవం
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామాలు, పట్టణాల్లో మార్పు కోరకు ఫలితాలు కొరకు ప్రభుత్వం వినూతన కార్యక్రమాలు చేపడుతున్నదని, ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రకారం విధులు నిర్వహించాల్సిన అవసరం ప్రతి ఉద్యోగిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి.రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు జిల్లా, రెవిన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఏర్పాటు చేసిన పదవీ విరమణ ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు మూడవ కలెక్టర్‌గా 4 ఫిబ్రవరి 2020న పదవీ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా విధులు నిర్వహించానని చెప్పారు. ప్రభుత్వం, సీఎస్ నా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీనియర్ జిల్లా కలెక్టగా విధులు నిర్వహణకు అవకాశం కల్పించిందని ఆ నమ్మకంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపానని చెప్పారు. ఈ 16 నెలలు విధుల నిర్వహణ ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కరోనా వ్యాధి ప్రమాదం నుండి ప్రజలను రక్షించడానికి ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ పట్ల మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, అలాగే గ్రామస్థాయిలో కార్యదర్శులు, సర్పంచులు విశేషంగా శ్రమించారని వారి సేవలను అభినందించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల భాగస్వామ్యంతో పాటు వైద్యాధికారులు సేవలు మరువలేనివని చెప్పారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు గ్రామస్థాయి నుండి ప్రజలకు అవగాహన కోసం టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. ఈ జిల్లాలో పనిచేయడం జీవితంలో ఒక గొప్ప అనుభూతిని కల్గించిందని చెప్పారు. జిల్లా ప్రజల సహాకారం మరువలేనిదని, ఎంతో సంతృప్తి నిచ్చిందని చెప్పారు. సమర్థవంతంగా పనిచేయుటలో అన్నిస్థాయిల్లోని సిబ్బంది. సహాకారం ఇచ్చారని చెప్పారు. ఆలిండియా టాపర్ యువకుడు డి.అనుదీప్ నేతృత్వంలో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ జిల్లాకు అనుదీప్ సేవలు ఎంతో అవసరమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మీడియా, జిల్లా ప్రజల సహాకారంతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని ఆయన సూచించారు. అనంతరం ఎంవి.రెడ్డిని జిల్లా గ్రంధాలయ చైర్మెన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్లు, సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం, జిల్లా అధికారులు, మండల అధికారులు శాలువాలు, మెమెంటోలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కర్నాటి వెంకటేశ్వర్లు, డి. అనుదీప్, జెడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎంవి.రెడ్డి సేవలు మరువలేనివి
ఆదివాసీలు, మారుమూల గ్రామాలున్న ఈ జిల్లాలో కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి సేవలు అభినందనీయమని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తెలిపారు. ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డికి శాలువా, మెమెంటోతో సత్కరించి కరోనా నియంత్రణ చర్యలు, గోదావరి వరదలు సందర్భంగా ముంపు ప్రాంతాల ప్రజల సంరక్షణకు చేపట్టిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లులో రైతులకు ఇబ్బంది లేకుండా చేపట్టిన చర్యలను అభినందించారు. వారి పరిపాలనా అనుభవంతో జిల్లాలో హరితహారం, ఉపాధిహామి పథకం పనులు, స్త్రీ నిధి రుణాలు, రైతు వేదికలు, పల్లె పకృతి వనాలు, వైకుంఠ ఛామాలు, డంపింగ్ యార్డులు నిర్మాణంలో జిల్లాను ఆదర్శంగా నిలిపారని వారి సేవలు ఈ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని కొనియాడారు.