Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తూటికుంట్ల సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ కరోనా బాధితుల పట్ల అందిస్తున్న సేవలకు గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. సీపీఎంకి చెందిన తూటికుంట్ల సర్పంచ్ నోముల వెంకటనరసమ్మ గ్రామంలో కరోనా కేసులు నమోదు ప్రారంభమైనప్పటి నుంచి నిర్విరామముగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు కరోనా బాధితులకు నిత్యం వివిధ రూపాలలో పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నారు. సర్పంచ్‌కి తోడుగా సిపిఎం, డివైఎఫ్ఐ గ్రామ కమిటీలు కూడా కరోనా బాధితులకు ప్రతిరోజు పౌష్టిక ఆహారాన్ని స్వయంగా కరోనా బాధితులు ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లటం, ప్రతిరోజు ఇంటింటి సర్వే చేయిస్తూ సర్వేలో తాను కూడా స్వయంగా పాల్గొంటూ కరోనా బాధితుల ఇబ్బందులను తెలుసుకుంటూ వారికి మనోధైర్యాన్ని నింపుతున్నారు. గ్రామంలో ఉన్న ఆశా వర్కర్స్‌తో పాటు సర్పంచ్ కూడా గర్భిణీ స్త్రీలను పర్యవేక్షిస్తూ వారికి తగు జాగ్రత్తలు ఇస్తూ కరోనా బాధితుల ఇల్లు వద్ద బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తూ వారికి అండగా ఉంటున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మూడు టీములను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపిస్తూ కోవిడ్ రెండవ దశ ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ తానే అయి నేటి వరకు గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తూ వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు, నిత్యం పారిశుద్ధ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ సర్పంచ్ అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం సర్పంచి చేస్తున్న కృష్టికి గ్రామ ప్రజలు సర్పంచ్‌ను అభినందించారు. సర్పంచ్‌కు తోడుగా ఆ గ్రామానికి చెందిన సిపిఎం ఎంపీపీ కంకణాల సౌభాగ్యం కరోనా బాధితుల సేవలో నిమగమై ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యద ర్శి తాళ్లూరి గోపి, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడి, కార్యకర్తలు, ఆశా వర్కర్స్ పాల్గొంటున్నారు.