Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ రేగా చేతుల మీదుగా అందించిన వైస్ ఎంపీపీ
నవతెలంగాణ-కరకగూడెం
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ అందించి రోగులకు అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఏజెన్సీ మండలంలో రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న విపత్కర పరిస్థితుల్లో పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి తనయుడు విశ్వభరత్ రెడ్డి (ఎన్ఆర్ఐ) మంచి ఆలోచనతో తమవంతు సాయంగా సోమవారం మండల గిరిజన ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాలకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతులమీదుగా ఇన్చార్జి వైద్యులు శివకుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా మాట్లాడుతూ ఎన్ఆర్ఐ విశ్వ భరత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంల్లో ప్రజల కోసం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని రేగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, భూర్గంపహడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, ఆత్మ కమిటీ డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం, అక్కిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీనువాసు రెడ్డి, రేగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.