Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం
నవతెలంగాణ-కొణిజర్ల
నెలలు గడుస్తున్నా కాంటాలు వేసిన వడ్లను ఎందుకు తరలించడంలేదని వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నా రైతులను గోడుపట్టించుకొనేవారే లేరా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పెద్ద గోపతి గ్రామంలో సోమవారం కల్లలో ఉన్న వరి ధాన్యాన్ని స్థానిక సీపీఐ(ఎం) నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూక్య వీరభద్రం మండల అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే లారీలు పంపించి రైతుల ధాన్యాన్ని తరలించాలని కోరారు. రైతులు కష్టపడి పండించిన పంటను కళ్లముందు అకాల వర్షాలతో తడిసి మొలకెత్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోవా ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ చొరవచూపి లారీల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ప్రతాపనేని లక్ష్మయ్య, అన్నవరపు వెంకటేశ్వర్లు, జొనేబోయిన అంజయ్య, దండు కృష్ణ, ఆడప పుల్లారావు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు స్వర్ణ సుబ్బారావు, రమణారెడ్డి, ఖాదర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు