Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఇటీవల కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడిన మోటార్ సైకిల్ మెకానిక్ చెన్నకేశవల నాగబ్రహ్మచారికి మెకానిక్ ల సంఘం అధ్యక్షుడు షేక్ బాజీ ఆధ్వర్యంలో రూ.3,700 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సుల్తాన్, నాగుల్ మీరా,శివశంకర్, రెడ్డి, బాజీ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత భోజన కార్యక్రమానికి హమాలీలు బియ్యం అందజేత
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోనే రావినూతల గ్రామానికి చెందిన కరోనా బాధితులకు సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర చేపట్టిన ఉచిత భోజన కార్యక్రమానికి రావినూతల గ్రామానికి చెందిన తాళ్లూరి ఆహరోన్ (వెంకటేశ్వర్లు) హమాలి ముఠా తమ వంతు సహకారంగా 50 కేజీల బియ్యం రూ.100 కోడిగుడ్లను సోమవారం సర్పంచ్‌కి అందజేశారు. వారికి రావినూతల గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రావినూతల గ్రామంలో కరోనా బాధితులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చి కరోనా బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కోరార