Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో ఏరియా జిఎం నర్సింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కొత్తగూడెం ఏరియా 2021-22 ఆర్థిక సంవత్సరం మే నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన 10.13 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 10.13 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం సాధించామని, 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి మే వరకు 20.20 లక్షల టన్నులకు గాను 20.21 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100 శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించామని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్. నరసింహా రావు తెలిపారు. సోమవారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల లక్ష్యంతో పాటు, ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుకున్న లక్ష్యం నూరు శాతం సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఉత్పత్తితో పాటు, అనుకున్న మేర వినియోగదారులకు మే నెలలో రోడ్డు, రైల్ ద్వారా 10.26 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సాధించినట్లు తెలిపారు. కొత్తగూడెం ఏరియా ఇప్పటి వరకు 281 వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. 35 మంధికి ఉద్యోగం బదులు ఏక మొత్తం నగదు చెల్లించటం జరిగిందన్నారు. ఒకరికి నెలవారి బృతి మంజూరు చేయటం జరిగిందన్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తున్న తరుణంలో సింగరేణి సంస్థ చైర్మెన్ ఆదేశాల మేరకు గౌతంపూర్ కమ్యూనిటీ హాల్ నందు 30 పడకలు, రామవరం సింగరేణి ఉమెన్స్ హాస్టల్లో 120 పడకలతో ఐసోలెసన్ సెంటర్ను ఎర్పాటు చేసి కోవిడ్ సోకిన ఉద్యోగులకు, ఒప్పంద కార్మికులకు,వారి కుటుంబ సభ్యులకు చికిత్సలు అందిస్తున్నామని వివరించారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ లో మొత్తం ఇప్పటి వరకు కొత్తగూడెం ఏరియా లో 735 మందికి ఉద్యోగులు-226, కుటుంబ సభ్యులు-456, ఒప్పంద కార్మికులు-53కి కరోనా సోకిందని తెలిపారు.వారిలో 188 మంది హాస్పిటల్లో, 162 మంది హౌం క్వారంటైన్లో ఉన్నారని, నలుగురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందారని, 369 ఉద్యోగులు-118, కుటుంబ సభ్యులు-232, ఒప్పంద కార్మికులు-19 మంది కరోనా వ్యాధి నుండి కోలుకోని తమ తమ విధులను నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. సత్తుపల్లి నందు సమంతా కంపనీ వారిచే నిర్మింపబడుతున్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను అక్టోబర్ నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. సత్తుపల్లిలో నిర్మించే 352 నివాస గృహాల నిర్మాణం పూర్తి అయిందని, 196 క్వార్టర్లను త్వరగతిన కార్మికులకు సీనియారిటీ ప్రకారం కేటాయిస్తామని తెలిపారు. అన్నీ గనులు, డిపార్ట్మెంట్లలో ఉద్యోగులందరికి కోవిడ్ వ్యాక్షినేషన్ గురించి రిజిస్ట్రేషన్ చేయించి ముందుగా 45 సంవత్సరముల పై వారికి వ్యాక్షినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని తెలిపారు.కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి నందు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సామాజిక భాద్యతలో భాగముగా సత్తుపల్లి పట్టణం, పెనుబల్లి కమ్మ్యునిటి హెల్త్ సెంటర్లకు 20 ఆక్సిజన్ సిలిండర్లను అందచేశామన్నారు.వాటి రీ-ఫిల్లింగ్ కొరకు రూ.5 లక్షల చెక్కును సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో కొమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ వసుమతి దేవికి అందచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జిఎం నారాయణ రావు, ఏరియా ఇంజనీర్ రఘురామి రెడ్డి, పివికే-5 గని ఏజెంట్ రవీందర్, వికేఓసి పిఓ శ్రీరమేష్, డిజిఎం పర్సనల్ సామ్యూల్ సుధాకర్, డిజిఎం ఎస్టేట్ ఆంజనేయ శెట్టి, డిజిఎం ఫైనాన్స్ రాజ శేఖర్, డిజిఎం సివిల్ సూర్యనారాయణ, డిజిఎం ఐఈడి ఉజ్వల్ కుమార్ బెహ్రా, ఏరియా స్టొర్స్ ఎస్ఈ (ఈ ఆండ్ ఎం) రత్న ప్రకాష్, ఏరియా వర్క్ షాప్ ఎస్ఈ(ఈ అండ్ ఎం) శ్రీకాంత్ సీనియర్, పర్సనల్ మేనేజర్ బుచ్చయ్య పాల్గొన్నారు.