Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది
- వ్యవసాయం బలోపేతం, 24 గంటల విద్యుత్‌తో ముందుకెళ్తున్నాం
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చుకునే క్రమంలో అనేక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించుకు న్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్స వేడుకలను పురస్కరించుకొని బుధవారం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయపతాకావిష్కరణ అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాధించుకొని ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, గత ఏడేళ్ళల్లో రాష్ట్రంలో అనేక రంగాల అభివద్ధి సాధించామన్నారు. ''కోవిడ్ సెకండ్ వేవ్''ను జిల్లాలో సమర్ధవంతంగా నియంత్రించగలిగామని, రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందన్నారు. జూన్-9లోగా పాజిటివ్ రేటును 5 శాతానికి తగ్గించాలనే దిశగా ప్రభుత్వం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాకు ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున వ్యాప్తిని అరికట్టేందుకు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక చెకోపోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నిఘాను మరింత కట్టుదిట్టం చేసామని తెలుపారు. కోవిడ్ కేసులను తగ్గించడంలో జిల్లాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు ప్రశంసనీయమన్నారు. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే వల్ల పాజిటివ్ రేటును తగ్గించుకోగలిగామని రోగలక్షణాలు కలిగిన వారికి మెడికల్ కిట్స్ ను అందించడంతో పాటు టెస్టుల సంఖ్యలను మరింత పెంచామని మంత్రి అన్నారు. జిల్లాలో ఆక్సిజన్, ఇంజెక్షన్ల సమస్యలేకుండా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచామన్నారు. ఆక్సిజన్ అవసరమైన కోవిడ్ పేషెంట్ల కోసం ఇంటివద్దనే ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు ఇండియన్ ఫ్రంట్స్ ఆఫ్ అట్లాంట, మమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను ఉమ్మడి జిల్లాకు అందించినట్లు మంత్రి తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులు విపత్కర పరిస్థితులలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమిషనర్ విష్ణు యస్ వారియర్, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పి.నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహారా, డి.సి.సి.బి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, గంథ్రాలయ సంస్థ చైర్మన్ ఖమర్, ఇతర ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.