Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా టెస్ట్ కోసం, వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ప్రజల కోసం రెండోవ రోజు కూడా సిపిఎం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కొనసాగింది. ఈ అల్పాహార కార్యక్రమం రావినూతల గ్రామ సిపిఎం సహకారంతో సాగింది. ఈ కార్యక్రమాన్ని రావినూతల ఎంపీటీసీ కందిమళ్ళ.రాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్ కోసం వచ్చే వారందరికీ ఉదయం పూట అల్పాహారం సిపిఎం ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. మండలంలో రోజురోజుకి కరోనా వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధిత కుటుంబాలకు నెలకు రూ. 7500, నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు. మండలంలో నిర్వహిస్తున్న ఐసోలేషన్ కేంద్రాల్లో బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తూ, పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాలలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆ గ్రామాలలో కూడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం రావినూతల రెండవ శాఖ కార్యదర్శి కొంగర.గోపి ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గుగులోతు. శారద, సిఐటియు మండల కో కన్వీనర్ గుగులోతు. నరేష్ , బోనకల్మా జీ సర్పంచ్ భుక్యా. జాలు, డివైఎఫ్ఐ నాయకులు గుగులోతు. సాయి, ధరావతు నరేష్ హరి, దరావతు. జగన్, గుగులోతు గణేష్, షేక్ ఖాసీం సాహెబ్, వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, కందిమళ్ళ. అచ్యుత్ రావు, గుగులోతు. శ్రీను తదితరులు పాల్గొన్నారు.