Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఏర్పాటుచేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ రంగారెడ్డి గౌలిదొడ్డి కళాశాలకు బోనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని యార్లగడ్డ ఐశ్వర్య అర్హత సాధించి ఎంపికయింది.10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు టి ఎస్ డబ్ల్యూఆర్ ఐ ఈ ఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ కళాశాలలో అర్హత కల్పిస్తారు. అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఈ కళాశాలల్లో రెండు సంవత్సరాల ఇంటర్మీడియేట్ విద్యతోపాటు ఐఐటి, నిట్, నీట్, సిఎమ్ఏ వంటి కోర్సులలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.రెండు సంవత్సరాల క్రితం ఐశ్వర్య జాతీయ ప్రతిభ పరీక్ష ఎన్ఎంఎంఎస్ నందు జిల్లాలో మూడవ ర్యాంకు సాధించి స్కాలర్షిప్ పురస్కారానికి ఎంపికయింది.2019 సంవత్సరంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో జిల్లా ప్రథమ స్థానం సాధించి నాటి కలెక్టర్ లోకేష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకుంది. ఐశ్వర్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ తమ ప్రతిభ ను చాటుతుంది. ఏ ప్రవేశ పరీక్షలో పాల్గొన్న ఐశ్వర్య అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ మంచి ఫలితాలను సాధిస్తుంది. ఐశ్వర్య ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి, ఉపాధ్యాయులు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిపిఎం బోనకల్ గ్రామ కమిటీ కార్యదర్శి తెల్లకుల శ్రీనివాస రావు బోనకల్ సర్పంచ్ భుక్యా సైదా నాయక్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గూగులోతు రమేష్ బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు ,గ్రామస్తులు , తదితరులు అభినందనలు తెలిపార-