Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
కరోనా మహమ్మారిని నివారిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండు రంగారావు విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాజబాబు, కొలికపోగు సర్వేశ్వరరావు, సప్పిడి భాస్కరరావు, మండూరి రవి, చావా రమేశ్, వెంకటేశ్వరరావు, కె.శ్రీను, ఎన్. వెంకటేశ్వరరావు, కుమారి, ఎస్కే వలీ పాల్గొన్నారు.
సత్తుపల్లిరూరల్ :పేదలకు కార్పొరేట్ స్థాయి కరోనా వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా బాధిత పేదకుటుంబాలకు రూ.7500 ఆర్ధిక చేయూతను అందించేందుకు మండల పరిధిలోని గంగారంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్లకార్డులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కావూరి వెంకటేశ్వరరావు, కువ్వారపు లక్ష్మణ్‌రావు, జూపూడి నరేష్, కొలికపోగు రత్తయ్య, రావూరి కమలమ్మ, నారాయణ, అజరు, రవి, నిర్మల పాల్గొన్నారు.
గాంధీచౌక్ : కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని సీపీఎం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని ప్లకార్డుల ద్వారా ఖమ్మం 30వ డివిజన్ సుందరయ్య నగర్లో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం 3 టౌన్ నాయకులు షేక్ హిమామ్, రంగు హన్మంతాచారి, యర్రా నగేష్, బెజవాడ చంద్రశేఖర్, షేక్ ముజీమ్ ఉమర్, చిట్టిమోదు ధన్య తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : స్థానిక చలమాల సూర్యనారాయణ భవనంలో సీపీఎం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనాను ఆరోగ్యశ్రీలో తక్షణమే చేర్చాలని పార్టీ మండల కార్యదర్శి చలమాల విఠల్‌రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ నాయకులు గాయం తిరుపతిరావు, సీఐటీయూ నాయకులు ఎం.స్వామి, తేజేవత్తు రాములు, చెన్నారావు చేత తిరపతిరావు, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు బెజవాడ సాయి తదితరులు పాల్గొన్నారు .