Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైద్యులు యలమంచిలి రవీంద్రనాథ్
- కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యం : బండి రమేష్
నవతెలంగాణ-ఖమ్మం
కరోనా సోకి చికిత్స పొందుతున్న రోగులు ధైర్యంగా ఉండాలని ప్రముఖ వైద్యులు యలమంచిలి రవీంద్రనాధ్ సూచించారు. గురువారం బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లోని పాజిటివ్ వచ్చిన వారితో ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాజిటివ్ వచ్చిన వారు మనో ధైర్యాన్ని కోల్పోకూడదన్నారు. కరోనా వైరస్ ముక్కు, నోరు, కళ్ళ గుండా మాత్రమే మనిషి శరీరంలోకి పోతుందన్నారు. 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచించారు. కరోనా వ్యాధి వచ్చి నయం అయిన వాళ్ల ద్వారా ఇతరులకు జబ్బు రాదని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఐసోలేషన్ సెంటర్ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అనేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో బివికే ఆధ్వర్యంలో ఐసోలేషన్ సెంటర్ నడుస్తుందని వారన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు తొమ్మిది మంది చేత ఈ సెంటర్లో ఉన్న పేషెంట్లకు వైద్యం అందించబడుతుందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పోషకాహారం రోగులకు అందించబడుతుందని తెలిపారు. ఇప్పటికే బివికె ఐసోలేషన్ సెంటర్ నుంచి అనేకమంది పాజిటివ్ వచ్చి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు వెళ్లారు అని గుర్తు చేశారు. సొంత కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో ప్రాణాలు లెక్కచేయకుండా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న వాలంటీర్లను వారు అభినందించారు. కార్యక్రమంలో ఎస్. నవీన్ రెడ్డి, రావులపాటి నాగరాజు, సైదారావు వైద్య సిబ్బంది షేక్ నౌషీన్, విజయ తదితరులు పాల్గొన్నారు.