Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీసీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో కరోనా బాధితులకు ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుకి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్‌ని కలిసి బీసీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు వినతిపత్రం అందజేశారు. గురువారం భద్రాచలంలో ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులలో తహశీల్దార్‌తో మాట్లాడి ఫైనల్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, ట్రస్ట్ నిర్వాహకులు ఏ.జె.రమేష్ మాట్లాడుతూ.. పట్టణం లో 80,000 మంది జనాభా నివసిస్తున్నారని పేర్కొ న్నారు. సుమారు16 వేల కుటుంబాలు నివసిసు ్తన్నాయని, వీరిలో అత్యధిక కుటుంబాలు ఒకటి లేదా రెండు ఇరుకైన గదులలో ఉంటున్నారని తెలిపారు. సగానికి పైగా అద్దె ఇండ్లలో ఉంటున్నారని అన్నారు. వీరికి ఒకటే బాత్ రూమ్ ఉండటం వల్ల, ఇరుకు గదుల వల్ల ఒకరికి కరోనా వస్తే, మొత్తం కుటుంబ సభ్యులకు కూడా కరోనా వ్యాపిస్తుందన్నారు. దీనితో ఐసోలేషన్ కేంద్రం అనివార్యంగా అవసరమవు తుం దన్నారు. ప్రజల ఆరోగ్యాలు, కరోనా తీవ్రత రీత్యా ఐ సోలేషన్ కేంద్రం ఏర్పాటు అనుమతిస్తే, వైద్యం, భోజ నం, వసతి మొత్తం బీసీఆర్ ట్రస్ట్ బాధ్య త చూసు కుంటుందని కలక్టర్కి తెలిపారు. కలెక్టర్‌ని కలిసిన ప్ర తినిధి బృందంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జె.రమేష్, పార్టీ పట్టణ కార్యదర్శి, ట్రస్ట్ కన్వీనర్ గడ్డం స్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, ట్రస్ట్ నిర్వాహకులు యం.బి.నర్సారెడ్డి తదితరులున్నారు.