Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కరోనా రోగుల పట్ల దాతలు తమ దాతృత్వాని చాటుకుంటూనే ఉన్నారు. పండో ఫలమో ఇచ్చి వారికి ధైర్యం కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు. అన్న ప్రసాదాలు అందజేస్తూ వారికి కడుపు నింపే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. మండలంలోని రామచంద్రుని పేట గ్రామంలో కరోనా సోకిన బాధిత కుటుంబాలకు ఆర్లగూడెం హెల్త్ సబ్ సెంటర్ ఏఎన్ఎమ్ కల్లూరి లకీë (నర్సమ్మ) 13 మంది కరోనా బాదిత కుటుంబాలకు సుమారు 2 వేల రూపాయల విలువ చేసే పండ్లను అందజేశారు. వీటిని రామచంద్రుని పేట సర్పంచ్ కొర్సా అశ్విని చేతుల మీదుగా అందజేశారు. సర్పంచ్ అశ్విని మాట్లాడారు.
35 మందికి అన్నం ప్యాకెట్లు పంపిణీ : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణా చలం నర్సాపురం వారి ఆద్వర్యంలో దుమ్ముగూడెం, భద్రాచలం పట్టణంలోని రహదారుల వెంట ఉన్న భిక్షాటకులకు పేదలకు సుమారు 35 మందికి అన్నం ప్యాకెట్లను గురువారం అందజేసినట్టు ఆలయ వ్యవస్థాపకులు శివ స్వామి తెలిపారు. ఎవరైనా ఆకలితో భాదపడుతుంటే అటువంటి వారి సమాచారం తమకు తెలియజేస్తే వారికి అన్నం ప్యాకెట్లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చే వారు 8247259616 అనే ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి తెలపాలని ఆయన తెలిపారు.