Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్‌కు ఎమ్మెల్యే వినతి
నవతెలంగాణ-భద్రాచలం
పట్టణంలో గోదావరి వరదల సమయంలో తీవ్ర సమస్యగా మారిన స్లూయిస్ లీకేజీలు నీరు చేరిన వెంటనే అరికట్టే విధంగా, కొత్త మోటార్లు కొనుగో లు చేసి అందుబాటులో ఉంచాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు గురువారం గోదావరి వరదల సమీక్ష సమావేశంకు హాజరైన కలెక్టరును కలిసి గోదావరి వరదల బారి నుంచి భద్రాచలంను రక్షించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సారి పోలవరం వద్ద నీటిని నిల్వ చేస్తుండటంతో ఇప్పటికే పాపికొండల ప్రాంతంలో ఇసుకతిన్నెలన్ని నీట మునిగిపోయాయని పేర్కొన్నారు. గోదావరికి వరద పెరిగితే భద్రాచలంకు మరింత వరద ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న రీత్యా భద్రాచలం నియోజకవర్గం మండలాలను తీవ్రస్థాయి లో నష్టం చేసే పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నా రు. అలాగే గోదావరి కరకట్ట మరమ్మతులు పూర్తి స్థాయిలో నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి నల్లపు దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.