Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లాల్లో తడిసిన ధాన్యపు రాశులు...
- కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫర్ లు...
నవ తెలంగాణ- ఖమ్మం రూరల్
మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి.కల్లాల్లో ధాన్యం రాశులుకు పట్టాలు కప్పి ఉంచినప్పటికీ భారీ వర్షం కురవడంతో కల్లాల్లో భారీగా వరద చేరి ధాన్యపు రాశుల కిందకు నీళ్లు చేరి ధాన్యం అంత తడిసి ముద్దయింది. మండలంలోని ముత్తగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు నిల్చి ధాన్యం రాశులు తడిసి ముద్దాయ్యాయి. గుదిమళ్ళ,వెంకటగిరి, కస్నాతండా,కొండాపురం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు,రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు.నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ముత్తగూడెం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం పోసిన రైతులు తడిసిన ధాన్యాన్ని తిరిగి ట్రాక్టర్ ల ద్వారా ఇళ్లకు తీసుకెళ్లారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఉరడీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్న దుర్మార్గమైన ప్రభుత్వం అన్నారు. ఇప్పటికైనా మంత్రి అజరు, పాలేరు ఎంఎల్ఏ కందాళ ఉపేందర్ రెడ్డిలు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి ముత్తగూడెం వద్ద గల 182/38 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫర్ లో మంటలు చెలరేగి కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచే ఖమ్మం రూరల్ మండలంతో పాటుగా తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాలకు విద్యుత్తు సరఫరా జరుగుతుంది.విద్యుత్తు ట్రాన్స్ఫార్ కాలిపోవడంతో మూడు మండలాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.తరువాత అధికారులు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. మంగళగూడెం శివారు కొత్తూరు సమీపంలో పిడుగుపడి ఓ విద్యుత్తు ట్రాన్స్ఫార్ కాలిపోయింది.తీరాల విద్యుత్తు సబ్ స్టేషన్ ఎదుట కాచిరాజుగూడెం శివారు వాల్యాతండా వద్ద పిడుగులు పడ్డాయి. కానీ ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదు...