Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
అందరితో కలివిడిగా ఉంటూ కలుపుకుని వెళ్లే వ్యక్తి అని, మంచికి మారుపేరు చేకూరి కాశయ్య అని పలువురు వక్తలు కొనియాడారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామం లో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ తక్కళ్లపాడు గ్రామ నివాసి చేకూరి కాశయ్య సొంత గ్రామంలో సంతాప సభను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొని మాట్లాడుతూ కాశయ్య చేసిన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, మధిర మార్కెట్ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, మాజీ మార్కెట్ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు మొగిలి అప్పారావు, దండెం సత్యనారాయణ రెడ్డి,సర్పంచ్ కూరపాటి సుందరమ్మ, ఎంపీటీసీ కూరపాటి యశోద, ఉప సర్పంచ్ అయిలూరి నాగిరెడ్డి,మోలుగుమాడు సోసైటీ చైర్మన్ మదన్ రెడ్డి, ఎర్రుపాలెం సొసైటీ అధ్యక్షుడు మాల్పూరి శ్రీనివాసరావు, పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు,