Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శుభకార్యాలపై తనిఖీలు నిర్వహించాలి
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్ డి.అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గించాలని, వివాహాలు, ఇతర శుభకార్యాలపై పటిష్ట తనిఖీలు నిర్వహించాలని, అనుమతి మేరకు మాత్రమే వ్యక్తులుండాలని, అనుమతికి మించి వ్యక్తులున్న ట్టయితే తక్షణం జాతీయ విపత్తుల కింద పోలీసు కేసు నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం జిల్లా, మండల అధికారులతో హై పాజిటివిటి, మొబైల్ టెస్టింగ్, లక్షణాలున్న వ్యక్తులు, శుభకార్యాలపై పటిష్ట పర్యవేక్షణ తదితర అంశాలపై టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హై పాజిటివిటి ఉన్న గ్రామాలు, మండలాల్లో వ్యాధి నియంత్రణకు పటిష్ట పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి కరోనాను నియంత్రణ చేయుటలో సర్పంచులు, ప్రజా ప్రతినిధుల సహాకా రం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 7 శాతం పాజిటివిటి రేటు ఉన్నదని ఈ శాతాన్ని కూడా జీరోకు తీసుకురావాలని ఇవే పటిష్ట నియంత్రణ చర్యలు కొనసాగించాలని చెప్పారు. ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, చర్ల, జూలూరుపాడు, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, గుండాల మండలాల్లో ఎక్కువ వ్యాధి కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో పటిష్ట పర్యవేక్షణ జరగాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్ హెడ్‌గా ఏర్పాటు చేయనున్న టాస్క్ ఫోర్సు కమిటీలో ఎంపీఓ, ఎంపీడీఓ, వైద్యాధికారులు సభ్యులుగా ఉంటారని వ్యాధి నియంత్రణకు పక్కా నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఐసోలేషన్ కేంద్రాల్లో విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించా లని చెప్పారు. ఫీవర్ సర్వేలో లక్షణాలున్నట్టు గుర్తించిన వ్యక్తులపై పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, విద్యుత్, చెట్లు, హోర్డింగులు వల్ల ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వర్షాలు వల్ల ఇండ్లు దెబ్బతినడం, ప్రజలు, పశువులు మరణించడం వంటి నష్టాలు జరిగితే తక్షణమే జాతీయ విపత్తుల కింద పరిహారం అందించు విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దారలను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు డాక్టర్ శిరీష, డాక్టర్ ముక్కంటేశ్వరావు, డీపీఓ రమాకాంత్, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డిఓ మధుసూదన్ రాజు, అన్ని మండలా తహసిల్దారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.