Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో 23వ డివిజన్‌కు చెందిన కరీం అనే యువకుడు మృతిచెందాడు. ఆ కుటుంబానికి సీపీఐ(ఎం) వన్‌టౌన్ కార్యదర్శి జబ్బార్ తన మిత్రల సహకారంతో ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహయాన్ని పార్టీరాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌రావు చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి ముస్తఫానగర్ ప్రాంతంలో ముఖ్యంగా వన్ టౌన్ ఏరియాలో జబ్బార్ సారథ్యంలో విస్తృతమైన ప్రజా ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిం చడం చాలా గొప్ప విషయం అన్నారు. కోవిడ్ కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారిని గమనించిన సీపీఐ(ఎం)కార్యకర్తలు దాతలు, స్థానిక పెద్దలు యువకుల సహకా రంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారన్నారు. అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారని, ఖమ్మం పట్టణం లో ఐసోలేషన్ సెంటర్ నడిపిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న కాలంలో ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని అని ఆయన ఆకాంక్షించారు. ఈ సహకారం అందించినటువంటి పెద్దలు దినేష్‌కి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు వై. విక్రమ్, స్థానిక సిపిఎం నాయకులు మెహ్రూన్నిసా బేగం, పొలమూ రు సరస్వతి, భాగం అజిత, అంబడి పూడి సుధాకర్, మోటమర్రి జగన్మోహన్ రావు, దాసరి నాగేశ్వరరావు, ఎస్కె. సత్తార్, కాంగ్రెస్ నాయకుల సంపద నరసరావు, కిరణ్ కుమార్, చింటూ, మేరాజ్ జానీ పాల్గొన్నారు.