Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
కరోనా వైరస్ సోకి అనేకమంది ప్రజలు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం హాస్పిటల్స్లో సరిపడ ఆక్సిజన్ సరఫరా కూడా ప్రభుత్వం సమకూర్చటంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా రోగులకు ఆక్సిజన్ అత్యవసరం అని భావించి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహయ సహకారంతో 2 లక్షల రూపాయలు విలువ చేసే ''ఆక్సిజన్ కాన్సెంట్రేటర్'' ను బివికె మేనేజర్ వై. శ్రీనివాసరావుకు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అందజేశారు. అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ సేకరించి సహాయం అందించిన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్ర బాధ్యులకు మరియు పార్టీ జిల్లా నాయకులకు బివికె బాధ్యులు కతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బషీర్, బివికె రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.