Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు చర్యలు చేపట్టాలి : కలెక్టర్
నవతెలంగాణ- రఘునాధపాలెం
గ్రామాలలో కొవిడ్ పాజిటివ్ రేటును తగ్గించేందుకు మండల అధికారుల బృందం సమన్వయంతో మరింత సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. మండలంలోని కోయచిలక, ఈర్లపుడి ఐసోలేషన్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా ఉన్న గ్రామాలలో మండల ప్రత్యేక అధికారితో పాటు మండల స్థాయి అధికారుల బృందం గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని పాజిటివ్ కేసులను గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకరి వల్ల కుటుంబంలో మిగిలినవారికి పాజిటివ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, దీనిపై అవగాహన కల్పించి పాజిటివ్ పేషెంట్లను తప్పనిసరిగా కేంద్రాలకు తరలించాలని, ప్రధానంగా గ్రామాలలో పాజిటివ్ కేసులు తగ్గించేందుకు అనునిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ఇళ్లలో సరైన సదుపాయాలు లేనటువంటి పాజిటివ్ పేషెంట్ల కుటుంబాలకు అవగాహన కల్పించి పాజిటివ్ పేషెంట్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించిమెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఉచిత వసతి భోజన సదుపాయాలను సమకూర్చి నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తాసిల్దార్ జి. నరసింహారావు, ఎంపీడీవో అశోక్ కుమార్, మండల ప్రత్యేక అధికారి విజయకుమారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరాల శ్రీనివాస్, ఎంపిఓ కొండపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.