Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
- లారీల ద్వారా ధాన్యం బస్తాలు తరలింపు
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో గోకినేపల్లి, మేడేపల్లి, యడవల్లి, ముదిగొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ పీడీ మెరుగు విద్యాచందన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం బస్తాలు ఆమె నిశితంగా పరిశీలించారు. గురువారం మండలంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దయి మొలకలు వచ్చిన విషయం విదితమే. ఈ విషయంపై నవతెలంగాణలో ''వర్షార్పణం'' కథనానికి స్పందించిన ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం బస్తాలు లారీల ద్వారా తరలించేందుకు చర్యలు చేపట్టారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె తెలపడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం గోకినేపల్లి, మేడపల్లి గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలను శుక్రవారం ఆమె సందర్శించారు. కార్యక్రమంలో డిపీఎం శ్రీనివాస్, ఏపీఎం గంగుల చిన్న వెంకటేశ్వర్లు. ఎంపీడీవో డి. శ్రీనివాసరావు. ఏపిఓ పి.అజరు కుమార్, సిసి అనురాధ, గ్రామ సర్పంచులు గుగులోతు క్రాంతి, సామినేని రమేష్, చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, మందరపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.