Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
ఆరుగాలం చెమటోడ్చి పండించిన ధాన్యం తడిసి ముద్దవుతున్నా అధికారులు కొనుగోలు చేయడం లేదని కోరుతూ శుక్రవారం ఖమ్మంరూరల్ మండలంలోని ముత్తగూడెం, పోన్నెకల్లు స్టేజిల వద్ద సిపిఎం ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల నాయకుడు బందెల వెంకయ్యలు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకవచ్చి 40 రోజు లకు పైగా గడిచినా కొనుగోలు చేయక పోవడం దారుణమన్నారు. మండలంలో గురువారం కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐ సత్యనారాయణ రెడ్డి సీపీఎం బృందంతో చర్చలు జరిపి సాయంత్రం లారీలతో మాట్లాడి మూడు రోజుల్లో ధాన్యం మొత్తం తరలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు పెరుమళ్ళపల్లి మోహన్‌రావు, పొన్నెకంటి సంగయ్య, తోట పెద్ద వెంకటరెడ్డి, నంది గామ కృష్ణ, పుచ్చకాయల నాగేశ్వరరావు, ఏటుకూరి ప్రసాద్‌రావు, మద్ది వెంకటరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.