Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా టెస్టులు గ్రామపంచాయతీ,
మండల కేంద్రాలలో నిర్వహించాలని, వ్యాక్సిన్ పేద ప్రజలందరికీ ఉచితంగా అందజేయాలని, డీఎంఅ ండ్హెచ్ఓతో పాటు అన్ని మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపు నిచ్చారు. శుక్రవారం జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ కొత్తగూడెం వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాటోత్ కృష్ణ, మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కరోనా వ్యాధి విపరీతంగా పెరుగుతున్నదని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల వరకు వ్యాపించి ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి పేదలను నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రంగా ద్వజమెత్వారు.
కేరళ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ వంటి రాష్ట్రల తీరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలను ఆర్ధిక ప్యాకేజిలు ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 వేలు ఇవ్వాలని, నెలకు ప్రతి కుటుంబానికి 50 కేజీల సన్న బియ్యం ఇవ్వాలని, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, ప్రతి మండల కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా పేషెంట్లకు కేరళ తరహా వైద్యం అందించాలని కోరారు. కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తేజావత్ వెంకన్న, సుధీర్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవి పల్లి తహసీల్దార్‌కు వినతి
కరోనా వైరస్పెరుగుతున్న నేపద్యంలో గ్రామ పంచాయతీ కేంద్రాలో కరోనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లక్ష్మీదేవి పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దా ర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ కృష్ణ, మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జి.సుధీర్, మండల అధ్యక్షుడు తేజావత్ వెంకన్న, మండల సహాయ కార్యదర్శి బట్టు వెంకటేశ్వర్లు, కరణం వీరభద్రం, డేరంగుల నాగేశ్వరరావు, వంశీ, రవి, మల్లయ్య పాల్గొన్నారు.