Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం పది రోజుల్లో కరోనా కేసులు జీరో కావాలి
- కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-గుండాల
అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరిగాయని, వారం పది రోజుల్లో కరోనా కేసులు జీరో అయ్యేం దుకు తగు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ అన్నారు. మండలం లోని మటంలంక (ఏపీఆర్) టీటీడబ్ల్యూఆర్జేసీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ఐసోలేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఐసోలేషన్ సెంటర్లో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు 5 ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు వారి ఇండ్లలో హౌం ఐసోలేషన్ సౌకర్యం ఉందా! లేకపోతే ఐసోలేషన్ కేంద్రంలో ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ఆర్ఎంపీలు వారి పరిధికి మించి చికిత్స చేయరాదని, అందుకు సంబంధించి గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారిని ఆదేశించారు. అనంతరం మండలంలోని పడుగోనిగూడెం, ముత్తాపురం గ్రామాల్లో పర్యటించి కరోనా బారిన పడిన వారికి మనో దైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వాగబొయిన రామక్క, ఎంపీటీసీ ఎస్కే సంధాని, ఉప సర్పంచ్ మానాల ఉపెందర్, ఎంపీడీఓ షేక్ హజ్రత్ వలీ, ఆళ్ళపల్లి తహసీల్దార్ సుల్తానా, మండల వైద్యాధికారి డాక్టర్ మున్వర్ అలీ, పడుగోనిగూడెం సర్పంచ్ కొటెం జయసుధ శోభన్ బాబు, ముత్తాపురం సర్పంచ్ పూనెం సమ్మయ్య, ఏఓ అశోక్ కుమార్, ఏఈఓ లెనిన్ తదితరులు పాల్గొన్నారు.