Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో డైరెక్టర్ (పా)కి వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో ప్రయివేట్ సెక్యూరిటీ గార్డ్స్‌తో పాటు వివిధ విభాగాలలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల అందరికీ కోల్ ఇండియా సర్కులర్ ప్రకారం కరోనా వల్ల మరణించిన వారికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కరోనా ట్రీట్మెంట్లో, హౌమ్ క్వార్ టైన్లో ఉన్నవారికి ప్రత్యేక సెలవు కింద భావించి పూర్తి వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా సింగరేణి హాస్పిటల్స్‌లో కరోనా నివారణకు వైద్య సదుపాయం కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సీఐటీయూ అనుబ ంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవారం సింగరేణి డైరెక్టర్ ఎన్. బలరామ్‌కు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.రామారావు, కమలాకర్, రామ కృష్ణ, రాజేంద్ర ప్రసాద్, రాజు, శేఖర్, నాగరాజు భాస్కర్, రమేష్ పాల్గొన్నారు.