Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ వారియర్ సింగరేణి కార్మికుడు జేవిఎస్.చంద్రశేఖర్
నవతెలంగాణ-మణుగూరు
నేటి మానవుడు ప్రకృతి సృష్టించిన విపత్తికి తట్టుకోలేక ఓటమి పాలయ్యాడు. ఎప్పుడు ఏ రూపంలో ఏ సంఘటన సంభవిస్తుందో తెలియక ప్రపంచ మానవాళి భయందోళనికి గురవతున్నది. దానికి ఉదాహారణ కరోనా సృట్టిస్తున్న విధ్వంసమే ముఖ్యకారణం. ప్రకృతికి విరుద్దంగా మానవుడు అభివృద్ధి మాటున ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని కాపాడుకుంటే మానవజాతి మనుగడ మనగలుగుతుందని గ్రీన్ వారియర్ సింగరేణి కార్మికుడు జేబిఎస్.చంద్రశేఖర్ అన్నారు. ఆయన మణుగూరు సింగరేణి ఏరియాలో కేసీహెచ్పిలో ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తునే... పర్యావరణ పరిరక్షణ, జంతువుల రక్షణ, ప్రకృతిని వినాశనం కాకుండా అనేక రకాలుగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నాడు. పర్యావరణంపై చంద్రశేఖర్‌కు వున్న అంకిత భావాన్ని చూసి నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్వీ రమణ అభినందించారు. సీసీఎంబీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనేక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి సదస్సులలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, జంతువుల రక్షణ కోసం గత 15 యేండ్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర అటవిశాఖ కార్యదర్శి శోభ, మేథా పట్కర్, అమల నాగార్జున, కాకతీయ యునివర్శిటి వైస్ చాన్స్‌లర్ కెవి రత్నంలు విల్లే కాక అంతార్జాతీయ పర్యావరణ ప్రేమికులు అతనికి అనేక రకాలుగా ప్రశంసలు, సన్మానాలు నిర్వహించారు. జూన్ 5వ తేదీన అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఏకోసిస్టమ్ రెస్టోరేషన్ అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత వున్న పరిస్థితుల్లో పీల్చే గాలి, తాగేనీరు, తినే ఆహారం కలుషితం అవతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేగవంతమైన జీవితంలో వాహనాల వాడకం పెంచడం వలన ఇందన కొరతతో పాటు మానవుడు గ్లోబల్ వార్మింగ్‌కి కారణమతున్నాడు. ఆయన వేసవి కాలంలో జంతువుల దాహార్తిని తీర్చించేందుకు నీటి తోట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు అందించాడు. దానీ ఫలితంగానే అటవి ప్రాంతంలో అటవి శాఖ అధికారులు జంతువుల కోసం తోట్లును ఏర్పాటు చేశారు. అతని తపన, ఆలోచన విధానాన్ని గమనించిన అటవిశాఖ అధికారులు గ్రీన్ వారియర్ బిరుదును ఇచ్చారన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాల్లో, గ్రామాల్లో మట్టి వినాయక విగ్రహాలను వాడాలని అవగాహన పెంపొందిస్తు, స్వతహాగా మట్టి విగ్రహాలను అందించి నీటి కాలుష్యం కాకుండా కృషి చేస్తున్నాడు. అతన్ని మణుగూరు సబ్ డివిజన్లోని అధికారులు, ప్రజలు జంతువు ప్రేమికుడుగా అప్యాయంగా పిలుస్తారు. అతని ఆలోచన గుర్తించి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని కార్మిక సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.