Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు 100 ఎకరాలు
- వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి కావాల్సిన భూ కేటాయింపులు
- వీడియో కాన్ఫరెన్స్‌లో
కలెక్టర్ డి.అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను ఈనెల 9వ తేదీ వరకు పరిష్కరిస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు 100 ఎకరాలు, వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి కావాల్సిన భూ కేటాయింపులు చేస్తామని కలెక్టర్ డి.అనుదీప్ తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లలతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు నిర్మాణాలు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలా యింపు, ధరణి దరఖాస్తులు పరిష్కారం తదితర అంశాలపై హైదరాబాద్ బీఆర్ కేఆర్ భవన్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులు 9వ తేదీ వరకు పరిష్క రిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు 100 ఎకరాలు, వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి కావాల్సిన భూమి కేటాయింపులు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ 12 జిల్లాలో కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాలో కలెక్టరేటే భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాల న్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణం కోసం టీఎస్ఐఐసీకి భూములు అప్పగించే విధంగా చర్యలు ప్రారంభించాలన్నాలన్నారు.
ధరణిలో పెండిం గ్ మ్యూటేషన్లు, భూ విషయాలకు సంబంధించిన ఫిర్యాదులు మాడ్యూల్స్, ప్రొహిబిటరి ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించి, జూన్ 9లోగా పరిష్కరించి తద్వారా రైతులకు రైతుబంధు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పెషల్ ట్రిబ్యునల్‌లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్‌లను నిర్వహించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, రోడ్డు భవనాల శాఖ ఈఈ భీమ్లా, ఏవో గన్యా, టీఎస్ఐడిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.