Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంజయ్య, ప్రసాద్...
నవతెలంగాణ-కూసుమంచి
మండలంలోని జీళ్ళచెరువు గ్రామ శివారు గ్రానైట్ ప్యాక్టరీ వద్ద శనివారం మోటర్ సైకిల్ బోల్తా పడిన సంఘటనలో సూర్యాపేట జిల్లా, మోతే మండలం నామారం గ్రామానికి చెందిన మామిడి సైదులు తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం అవుతుండగా అటుగా వస్తున్న జీళ్ళచెరువు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య, మడిపల్లి ప్రసాద్ మానవత్వం చాటుకున్నారు. ప్రథమ చికిత్స అందించారు. లాక్డౌన్ సమయంలో ప్రమాదం జరగడంతో వాహనాలు రాకపోవడం, వచ్చే వచ్చిన వారు చూసి వెళ్తుండటంతో కానిస్టేబుల్ సహాయంతో ఓ ఆటో డ్రైవర్ను బతిమిలాడి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో స్థానికులు ఆ ఇద్దరు వార్డు సభ్యులను అభినందించారు.