Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి వ్యక్తికి 15 కిలోల సన్న బియ్యం
- రెండు నెలల పాటు ఉచితం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన రేషన్ లబ్దిదారుల కుటుంబాలకు ప్రభుత్వం చేయూతను అందించనుందని, రెండు నెలల పాటు రేషన్ దుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి ఉచితంగా 15 కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర్య అన్నారు. శనివారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చింతలపాటి వీధిలో ఉన్న రేషన్ దుకాణంలో ఈ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దారు కేవీఎంఏ మీనన్, కౌన్సిలర్లు ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, మేకల భవాని, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, నాయకులు నరుకుళ్ల శ్రీనివాసరావు, మేకల నరసింహారావు పాల్గొన్నారు.
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
వాతావరణ సమతుల్యతను రక్షించేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం స్థానిక అర్బన్ పార్కులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులో ఎమ్మెల్యే మొక్కను నాటారు. అనంతరం 375 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న అర్బన్ పార్కు అటవీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అటవీ ప్రాంతాన్ని పార్కుగా తీర్చిదిద్దున్న నేపథ్యంలో అందులోని వన్య ప్రాణుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, సీఐ రమాకాంత్, అటవీశాఖ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇప్పటికే ఈ పార్కులు 100 కి పైగా దుప్పులు, లేళ్లు ఉండటం గమనార్హం.