Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ కొండలరావు
నవతెలంగాణ-బోనకల్
మండలంలో నకిలీ విత్తనాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని ఎస్ఐ బి కొండలరావు హెచ్చరించారు. మండల కేంద్రంలో గల లక్ష్మీ ట్రేడర్స్ పురుగు మందుల షాపు శనివారం ఆయన తనిఖీ చేశారు షాపులో వివిధ రకాల రికార్డులను, పురుగుమందులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కావడంతో రైతన్నలు ఫర్టిలైజర్ దుకాణాలకు వస్తుంటారని, వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు ఒరిజినల్ బిల్లులు ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల సమన్వయంతో నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో ఐదు టాస్క్ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు , నిషేధిత మందులు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్కువ ధరకు విత్తనాలు దొరుకుతున్నాయనే ఉద్దేశంతో ఎక్కడపడితే అక్కడ విత్తనాలను కొనుగోలు చేసి నష్టపో వద్దని కోరారు.
ఎర్రుపాలెం : రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు విక్రయించినట్లు సమాచారం అందితే వారిపై కేసులు నమోదు చేస్తామని మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఐ ఉదరు కిరణ్ హెచ్చరించారు. మండల పరిధిలోని శకినవీడు, ఇనగాలి గ్రామాల్లో గల దుకాణాలను సంయుక్తంగా కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల నిల్వలు వాటికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.